construction of the balanagar flyover: నవంబర్ నాటికి బాలనగర్ ఫ్లైఓవర్ పూర్తి
Balanagar Flyover : బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు
Balanagar Flyover : బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవంబర్ నెల నాటికి బాలానగర్2 ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే వాహనదారుల ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోతాయన్నారు. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందని, ఆ సమస్య పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు కరోనా కారణంగా మధ్యలో కొద్ది రోజులు నిలిచిపోయాయని చెప్పారు. నగరంలో అనేక ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడానికి అనేక చోట్ల ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 68.67 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలోమీటర్ల 6 లైన్స్ గా బాలానగర్ ఫ్లై నిర్మాణ పనులు వేగవంతం గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీని నిర్మాణం ద్వారా కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ల పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్, ప్రశాంతి, జీహెచ్ఎంసీ, సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ ప్రేమ్ జ్యోతి, ఈఈ హుస్సేన్,, డీఈ అప్పారావు తదితరులు ఉన్నారు.