Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్

Telangana: రాహుల్ యాత్ర తెలంగాణ నుంచి ప్రారంభించాలని తీర్మానం

Update: 2022-05-17 02:28 GMT

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ 

Telangana: రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం నుండే శ్రీకారం చుట్టాలని టిపిసిసి భావిస్తుందా...? టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ యాత్ర పై ఏం తీర్మానం చేశారు ..? రైతు డిక్లరేషన్ పై రైతు రచ్చబండ పేరుతో పల్లెబాట పట్టనుందా..? టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు ..?

తెలంగాణ లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ పర్యటన తరువాత మంచి జోష్ లోకి వచ్చింది. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ ని పల్లె పల్లెకు రైతు రచ్చబండ తో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టిపీసీసి సిద్ధమైంది. ఈ నెల 21 నుండి నెల రోజుల పాటు 400 మంది ముఖ్య నేతలు రైతు డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు ఉదయపూర్ లో జరిగిన నవసంకల్ప్ చింతన్ శిబిర్ లో చేసిన తీర్మానాలపైన టిపిసిసి విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మరింత బంధాన్ని పటిష్టం చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా భారత్ జోడోయాత్ర ను అక్టోబర్ 2 నుండి చేపట్టబోతుంది. ఈ యాత్రను తెలంగాణ నుండి రాహుల్ ప్రారంభించాలని టీపీసీసీ తీర్మానం చేసింది.రాహుల్ గాంధీ మూడు నెలలకు ఒకసారి తెలంగాణలో పర్యటించే విధంగా కార్యాచరణ రూపొందించింది.

ఉదయ్ పూర్ లో 3 రోజుల పాటు జరిగిన నవసంకల్ప్ చింతన్ శిబిర్ లో తీసుకున్న అన్ని అంశాలను టీపీసీసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశంలో ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానం సోనియాగాంధీ కి పంపించాలని నిర్ణయించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుండి జూన్ 21 వరకు రైతు రచ్చబండ కార్యక్రమాలను చేపట్టనున్నారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించాలి. 30 రోజుల పాటు అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ సభలు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని జయశంకర్ సొంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొననున్నారు.తెలంగాణలో జరిగే అన్ని కాంగ్రెస్ కార్యక్రమాలు దేశంలో తెలంగాణ ఒక మోడల్ అని పేరొచ్చిందని రేవంత్ నేతలతో తెలిపారు.

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య నాయకులు,వివిధ అనుబంధ సంఘాల ఛైర్మన్,లు డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు కొంతమంది సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ రచ్చబండ లో రైతు డిక్లరేషన్ ని ఎంత వరకుకాంగ్రెస్ నేతలు ప్రజలకు చేరవేస్తారో చూడాలి.ఈ రచ్చబండ లో నాయకులంతా కలిసి రచ్చ చేస్తారో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

Full View


Tags:    

Similar News