Kamareddy: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో సస్పెన్షన్‌ల కలకలం

Kamareddy: ఏడాది పాటు కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్‌ మదన్ మోహన్ సస్పెండ్

Update: 2022-04-24 10:00 GMT
Congress Party in Kamareddy District | Telugu News

Kamareddy: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో సస్పెన్షన్‌ల కలకలం

  • whatsapp icon

Kamareddy: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో సస్పెన్షన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. షబ్బీర్ అలీ, మదన్ మోహన్ మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ ఏడాదిపాటు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. షబ్బీర్ అలీతో విబేధాలే మదన్ మోహన్‌ సస్పెన్షన్ కు కారణమని ప్రచారం జరిగింది. ఏడాది క్రితం జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో షబ్బీర్ అలీ కుమారున్ని మదన్ మోహన్ ఓడించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలు ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెంచాయి. ఇటీవల అజారుద్దీన్ ప్రకటనతో వివాదం మరింత ముదిరింది. కామారెడ్డిలో పోటీ చేస్తానంటూ అజారుద్దీన్ ప్రకటించారు. అజారుద్దీన్‌తో మదన్ మోహన్ ప్రకటన చేయించారని షబ్బీర్ అలీ ఆగ్రహంగా ఉన్నారు.

Tags:    

Similar News