Fuel Price Hike: పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ నిరసనలు
Fuel Price Hike: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిట్ ధరలు పెరుగుతున్నాయని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
Fuel Price Hike: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిట్ ధరలు పెరుగుతున్నాయని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఏడాదిలో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టన కాంగ్రెస్ నేతలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్టలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా టైమ్‌లో ధరలు పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు.
పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలంటూ కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ నిరసనలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఓ వైపు కరోనా కష్టాలతో ప్రజలు అల్లాడుతుంటే చమురు ధరలతో ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ధరలను తగ్గించాలన్నారు పొన్నం ప్రభాకర్.