Harish Rao: విద్యా, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు

Harish Rao: తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలోనే నాన్ లోకల్ గా మారే ప్రమాదం

Update: 2024-08-07 15:49 GMT

Harish Rao: విద్యా, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు

Harish Rao: విద్యా, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసేలా జీవోలు ఉన్నాయన్నారు. తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలోనే నాన్ లోకల్ గా మారే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జీవో 33 ను తీసుకొచ్చింది. చివరి నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్ అవుతారని ప్రభుత్వం జీవో ఇచ్చింది.

దీని ద్వారా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇక్కడ పీజీ చేయడానికి నాన్ లోకల్ అవుతున్నారన్నారు హరీష్‌ రావు. విద్యావకాశాల్లో స్వంతంగా రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఈ సంవత్సరం నుండి వచ్చింది. మెడికల్ విద్యా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం హై లెవల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News