తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం.. కేవలం 49శాతం మంది మాత్రమే పాస్
సగంమంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారంటున్న తల్లిదండ్రులు పేపర్ వాల్యుయేషన్‌పై ఆరోపణలు
Telangana: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాల్లో గందరగోళం నెలకొంది. గురువారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. 49 శాతం మంది విద్యార్థులనే ఉత్తీర్ణులను చేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక గురువారం ఇంటర్‌బోర్డు ఫలితాలను విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో 56 శాతం బాలికలు, 42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4లక్షల 59వేల 242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2లక్షల 24వేల 12 మంది ఉత్తీర్ణత సాధించారు. కరోనా కారణంగా గతేడాది పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్ మెదటి ఏడాది విద్యార్థులందరినీ రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశారు. పరిస్థితులు కుదుటపడటంతో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు.