తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి పంజా

తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా‌, వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.

Update: 2020-12-08 06:30 GMT

తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా‌, వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 9 అయినా.. మంచుదుప్పట్లు వీడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. మినుములూరులో సోమవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడి కాఫీ బోర్డులో ఆదివారం 12 డిగ్రీలు నమోదు కాగా సోమవారానికి 8 డిగ్రీలకు పడిపోయింది. ఇక అరకు లోయలో 12.7 డిగ్రీలు, చింతపల్లిలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఏజెన్సీ, మన్యం ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

Tags:    

Similar News