Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముహూర్తం ఖరారు..పంపిణీ ఎప్పట్నుంచంటే?

Indiramma House: రైతు రుణమాఫీతో రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక సమాచారం ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఎప్పటి నుంచి పంపిణీ చేయనుందో కూడా వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-08-04 06:07 GMT

Indiramma Houses: పేద ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు..ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన

Indiramma House: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాగా మరో పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఇండ్ల లేని పేదవారికి ఇందిరమ్మ ఇంట్ల కింద ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ పథకానికి సంబంధించి తాజాగా కీలక్ అప్ డేట్ ను వెలువరించింది.

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్లపై మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోపే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో 4.30లక్షల మందికి ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. గత సర్కార్ 10ఏండ్ల పాటు అధికారంలో ఉండి కేవలం లక్షన్నర డబుల్ బెడ్ రూం ఇండ్లు మాత్రమే నిర్మించిందని..ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలోనే ఏకంగా నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించబోతున్నట్లు తెలిపారు.

ఇక సొంత స్థలం ఉండి ఇళ్ల కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల స్కీం కింద ఇండ్ల మంజూరు చేస్తారు. అదే సొంత స్థలం లేనట్లయితే..ఇంటి స్థలంతోపాటు ఆర్థిక సాయం కింద రూ. 5లక్షలు అందించనుంది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గానికి 3,500ఇండ్ల నిర్మాణం లక్ష్క్ష్ంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.

Tags:    

Similar News