నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం
Integrated Residential Schools: తెలంగాణలో నేడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది.
Integrated Residential Schools: తెలంగాణలో నేడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. నల్గొంండ, దేవరకద్ర, జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది.