CM Revanth Reddy: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్..ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-07-06 00:51 GMT

CM Revanth Reddy: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్..ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy:ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికాకూడదని సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకుని సర్కార్ వాటిని అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల ప్రస్తుతం చేపడుతున్న నియామకాలు రద్దయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం తెలిపారు. కొన్నేళ్లుగా చిక్కుల్లో ఉన్న గ్రూప్ 1,2,3 నియామకాలు కూడా చేపట్టేందుకు ముందు వచ్చినట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్ లో ఉన్న విధంగానే పోటీ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సీఎం తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్ తోపాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 3గంటల పాటు ఈ సమావేశం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనలన గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. నిరుద్యోగులపై లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తర్వాతి నిర్ణయంతీ తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News