Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు

Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు పడింది.

Update: 2024-10-09 11:13 GMT

Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు

Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు పడింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని సూచించారు. 24గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని .. ఆ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ఇందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు.

2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. కమిషన్ ఏర్పాటుకు 24 గంటల్లో ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటినీ ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీ సూచించింది.

Tags:    

Similar News