Revanth Reddy: హైడ్రా దూకుడుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: చెరువులను కబ్జా చేసిన ఎవర్ని వదిలిపెట్టబోమని సీఎం హెచ్చరిక
Revanth Reddy: హైడ్రా దూకుడుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్ పరిధిలో చెరువులను కబ్జా చేసిన ఎవర్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్ళ నిర్మాణాలనూ హైడ్రా కూల్చివేసిందని, మొదటగా తమ పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్‌నే కూల్చారన్నారు. ORR బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని, ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అవుతుందని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు సీఎం. Ftl, బఫర్ జోన్ లో తన కుటుంబ సభ్యుల నిర్మాణాలు ఉంటే వివరాలు ఇవ్వండి తానే వచ్చి దగ్గర ఉండి కూల్చివేయిస్తా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్.
ఇక జన్వాడ ఫామ్‌హౌజ్ ఇష్యూపై స్పందించిన రేవంత్.. Ktr లీజ్‌కు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా..? అని ప్రశ్నించారు. ఒకవేళ ఎన్నికల అఫిడవిట్‌లో చూపించకపోతే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్‌ను ktr ఎలా లీజ్‌కు తీసుకుంటాడని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు సీఎం. మరోవైపు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాల పైనా రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
2లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. టెక్నికల్ కారణాలతో ఎవరికైనా రుణమాఫీ కాకపోతే.. సంబంధింత అధికారులకు అప్లికేషన్స్ ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్లలో గ్రీవెన్స్ పెట్టామన్నారు. అలాగే కవిత బెయిల్ పై రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్- బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు సీఎం రేవంత్. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందన్నారు. కేజ్రీవాల్‌కు రాని బెయిల్.. ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు.