CM KCR: వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల తక్షణ సాయం.. వెయ్యి కోట్లతో..
CM KCR: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకస్మిక వర్షాలు, వరదల వెనక విదేశీ కుట్రలు ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
CM KCR: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకస్మిక వర్షాలు, వరదల వెనక విదేశీ కుట్రలు ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో లడ్డాఖ్, ఉత్తరాఖండ్‌లో ఇలానే చేశారని ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ అదే జరుగుతుందని అన్నారు.
భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 7వేల 274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్ చెప్పారు. ప్రతీ కుటుంబానికి 20 కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, క్యాంపుల నుంచి ఇప్పుడే పంపిచ వద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
శాశ్వతంగా వరద ముంపు సమస్య పోవాలన్నా కేసీఆర్ భద్రాచలం పట్టణం వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి, ప్రభుత్వం కలిసి వేయి కోట్లతో రెండు, మూడు వేల కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. భద్రాచలం, పినపాకలో వరద బాధలు లేకుండా చర్యలు చేపడుతామన్నారు. గోదావరికి 90 అడుగుల మేర వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్ అక్కడ వరద పరిస్థితిని సమీక్షించారు. వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. అనంతరం గోదావరికి శాంతి పూజలు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను కేసీఆర్ పరామర్శించారు. భద్రచలానికి గోదావరి వరదల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పిస్తామని ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్.