CM KCR: ఇవాళ కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
CM KCR: తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట కరీంనగర్‌కు చేరుకోనున్న కేసీఆర్.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం గంగాధరకు వెళ్లి అక్కడి సభలో ప్రసంగిస్తారు. ఇక జమ్మికుంటకు చేరుకుని అక్కడ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం పరకాల నియోజకర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధమని.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు బీజేపీపైనా సీఎం కేసీఆర్ సభల్లో తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.