గోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సీఎం కేసీఆర్‌ ఫైర్‌

Update: 2022-08-15 06:33 GMT

గోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR: రాష్ట్రంలో మత చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. వాటిని అందరూ తిప్పికొట్టాలన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండానే కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు.

అధికార వికేంద్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అప్పులు చేయనివ్వకుండా.... తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతుందని ఆరోపించారు. రాష్ట్రాల స్వతంత్రను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతుందని... సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంటే దానిని ఉచితాలుగా పేర్కొంటుందన్నారు. ఉచితాలను పేద ప్రజలకు అందించకుండా కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారన్నారు. కేంద్రం పన్నుల రూపంలో రాష్ట్రాల నుంచి వసూలు చేసే ఆదాయంలో 41 శాతం వాటాను ఇవ్వాలని ఆయన కోరారు.


Full View


Tags:    

Similar News