CM KCR: సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు
CM KCR: గాంధీభవన్ వ్యూహాలను గులాబీ బాస్ తిప్పికొడతారా..?
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్..మెదక్, సూర్యాపేట జిల్లాల పర్యటన ఖరారైంది. రెండు రోజుల రోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా.. ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు..
మెదక్ జిల్లా పర్యటన అనంతరం.. మరుసటి రోజు..అంటే.. ఈ నెల 20న సూర్యాపేటకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. నూతనంగా నిర్మించిన సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంతో పాటు..ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ ఆఫీస్‌తోపాటు మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభిస్తారు.
ఇక.. మెదక్, సూర్యాపేట సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఇప్పటికే విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ పొలిటికల్ స్ర్కీన్‌ను హీటెక్కిస్తున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేద ప్రజలకు ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతోంది. మరోవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తున్న హస్తం పార్టీ.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కౌంటర్ స్పీచ్ ఎలా ఉండబోతోందనేది రాజకీయాల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.