వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

Update: 2020-12-18 16:15 GMT

ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొద్దిరోజులుగా హైకోర్టు నుంచి తెలంగాణ సర్కార్‌క పదేపదే షాకులు తగులుతూనే ఉన్నాయ్. ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో అమలవుతున్న దానికి తేడా ఉండడంతో న్యాయస్థానం సీరియస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా... ఏం జరగబోతుంది ?

తెలంగాణలో ధరణి పోర్టల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయ్. ప్రస్తుతం వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌లు మాత్రమే జరుగుతున్నాయ్. కోర్టు కేసుల కారణంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తాయ్. ఆధార్ కాలమ్‌ను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని కులం, కుటుంబసభ్యుల వివరాలు తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య శనివారం సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్‌తో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తెలంగాణలో దాదాపు 3నెలల తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయ్. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పాత పద్ధతిలోనే చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఐతే వాస్తవంలో అలా జరగడం లేదని కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటూ మూడురోజులుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేస్తున్నారు. 

Tags:    

Similar News