CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR: జూన్ 3 నుంచి 15 రోజులపాటు పల్లె, పట్టణ ప్రగతి
CM KCR: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి వచ్చే నెల 5 వరకు చేపట్టాల్సిన పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున జూన్ 3 నుండి 15 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు,దళిత బంధు అమలు పై అధికారులను ఆడిగి తెలుసుకున్నారు సీఎం జూన్ 2 వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పెత్తనం పై మరోసారి ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్.
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20 నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుండి ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అమలౌతున్న కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లు,అడిషనల్ కలెక్టర్ లు , జిల్లా ఉన్నతాధికారులు ,మంత్రులు ,ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఈనెల 20 నుండి కాకుండా వచ్చేనెల మూడు నుండి పల్లె ప్రగతి నిర్వహించాలని తెలుపగా సీఎం అంగీకరించారు. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి సమీక్ష చేసారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.తడిచిన ధాన్యం పూర్తి స్థాయిలో కొంటామని తెలిపారు సీఎం కేసీఆర్.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే సేకరించామని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నామని అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని ఫైర్ అయ్యారు సీఎం. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు.
ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళిత బంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సీఎం సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన తరువాత దశల వారీగా దళిత బంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయనుంది. జూన్ 2 నా కొన్ని గ్రామాలను ఎంపిక చేయనున్నారు.