కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద సమీక్ష సమావేశం జరిగింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద సమీక్ష సమావేశం జరిగింది. జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సిఎం దృష్టికి తెచ్చారు.
జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్టు సీఎం తెలిపారు. వారిని రెగ్యలరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయిందన్నారు. నిబంధనలు అనుమతించిన మేరకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.