CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చ
CM KCR: ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన చర్చించనున్నారు. జులై 1 నుంచి 10 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జరగనుండగా.. పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన అజెండాగా ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. కనీస వసతులు రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే.. ఈ సమీక్షలో పాలనాపరమైన అంశాలపై కలెక్టర్లకు అదనపు బాద్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు మూడు విడతలు పల్లె ప్రగతి, ఒక విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ఈసారి రెండు కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించబోతోంది. హరితహారంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఆరు విడతలుగా నిర్వహించిన హరితహారంలో 2వందల 10 కోట్ల మొక్కలు నాటారు. ఇందుకోసం 5వేల 591 కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ సర్కార్.