CM KCR: రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరి ధాన్యం కొంటాం..
CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు.
CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా వరి ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ఆరా తీశారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎండలు ఇంకా తగ్గకపోవడంతో ఈ నెల 20 నుంచి ప్రారంభించాల్సిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి జూన్ 3 నుంచి శ్రీకారం చుట్టనున్నారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.