ప్రజలందరికి మోడీ ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది.. మోడీ ప్రభుత్వానికి మెదడు లేదు.. నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..

CM KCR Press Meet: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.

Update: 2022-02-01 13:54 GMT

ప్రజలందరికి మోడీ ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది.. మోడీ ప్రభుత్వానికి మెదడు లేదు.. నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..

CM KCR Press Meet: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. బడ్జెట్‌లో దేశ ప్రజలందరికి మోడీ ప్రభుత్వం గుండుసున్నా పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్. ఎస్సీలు, ఎస్టీలకు కలిపి 12వేల కోట్లు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు సీఎం కేసీఆర్

కరోనా సమయంలో మోడీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా ప్రభుత్వం పేదల పట్ల కర్కషంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

నదుల అనుసంధానం చేస్తామంటూ మోడీ ప్రభుత్వం అతిపెద్ద జోక్ పేల్చిందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రాల ప్రమేయం లేకుండా ట్రిబ్రునల్ తీర్పులను కాదని గోదావరి-కావేరీ నదులను ఎలా అనుసంధానం చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు కేసీఆర్. నదుల అనుసంధానంపై కేంద్రానికి కనీసం నాలెడ్జ్ కూడా లేదని విమర్శించారు.

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు దిక్కుమాలిన సంస్కరణలు అని మండిపడ్డారు కేసీఆర్. మోడీ సర్కార్‌కు మెదడు లేదని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని కోలుకోకుండా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు వైఖరి వల్లే ఈనాడు దేశంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడిందని సంచలన ఆరోపణ చేశారు సీఎం కేసీఆర్. కేంద్రం బ్యాడ్ వాటర్ పాలసీ వల్లే ఇలాంటి సమస్య ఏర్పడిందన్నారు. దేశంలో 65వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నా ఇప్పటివరకు 35వేల కోట్ల నీటిని మాత్రమే వాడుకుంటున్నామన్నారు. 

Tags:    

Similar News