CM KCR: నేడు సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో బహిరంగసభ

CM KCR: శాలపల్లి ఇందిరానగర్‍ వద్ద 25 ఎకరాల్లో సభా స్థలి సిద్ధం * దాదాపు లక్ష మందిని సభకు తరలించే ఏర్పాట్లు

Update: 2021-08-16 04:51 GMT

నేడు హుజురాబాద్ లో సీఎం కెసిఆర్ సభ (ఫైల్ ఇమేజ్)

CM KCR: హుజూరాబాద్‌ ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలాంటి టైంలో సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ఇవాళ సభ పెట్టనున్నారు. ఇదీ దళిత బంధు పథకం ఆవిర్భావ సభ అయినప్పటికీ బైఎలెక్షన్‌ టైంలో పొలిటికల్‌ మీటింగ్‌గానే కనిపిస్తోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. హజూరాబాద్‍ నుంచి జమ్మికుంట వెళ్లే రోడ్డులో శాలపల్లి ఇందిరానగర్‍ వద్ద సుమారు 25 ఎకరాల్లో సభా స్థలాన్ని సిద్ధం చేశారు. దాదాపు లక్ష మందిని ఈ సభకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 50 వేల మందికి కుర్చీలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో 20వేల 9వందల దళితకుటుంబాలున్నాయి. వారిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 825 బస్సులను కేటాయించారు.

నాందేడ్‍ నుంచి వచ్చిన కూలీలు ఐదురోజులుగా సభా ప్రాంగణం ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎం సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. ఈ సభ చారిత్రాత్మక సభగా చెప్పుకోవచ్చని హరీష్‌రావు అన్నారు. అటు ఉపఎన్నిక, ఇటు దళిత బంధు ప్రారంభం కావడంతో ప్రతి దళితబిడ్డ హుజూరాబాద్ సభకు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతుబంధు పథకాన్ని ఇటీవల వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో లబ్ధిదారులందరికీ చెక్కులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బైఎలెక్షన్‌ టైంలో సభ పెట్టడంతో సీఎం కేసీఆర్‌ ఏం మాట్లాడుతారని ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News