కే విశ్వనాథ్‌తో సీఎం కేసీఆర్ భేటీ..

తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఫిల్మ్‌నగర్‌లోని దర్శకుడి ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

Update: 2019-08-11 11:44 GMT

తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఫిల్మ్‌నగర్‌లోని దర్శకుడి ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమంస్వాతిముత్యం, స్వర్ణకమలం లాంటి ఎన్నో అద్భుత కళాఖండాలను తెరకెక్కించిన విశ్వనాథ్‌ దర్శకుడిగా, నటుడిగా వెండితెరపై చెరగని ముద్రవేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. తన ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విశ్వనాథ్ ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియోను సైతం విడుదల చేశారు. కాగా కేసీఆర్‌ వ్యక్తిగత పనిమీదే ఆయనను కలిసేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News