మేడ్చల్ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ధరణి పోర్టల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధరణి పోర్టల్ అందుబాటులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో గత 50 రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభంకానున్నాయి. మరోవైపు మేడ్చల్ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.