ధాన్యం కొనుగోళ్లపై మళ్లీ కేసీఆర్ యుద్దం

CM KCR: తెలంగాణ భవన్‌లో జరిగిన TRS కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు పలు సూచనలు చేశారు.

Update: 2021-12-17 13:32 GMT

CM KCR: తెలంగాణ భవన్‌లో జరిగిన TRS కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లందరికీ పదవులు వస్తాయన్నారు. నామినేటెడ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్న కేసీఆర్‌ నాయకులు కొంత ఓపికతో ఉండాలన్నారు. దళితబంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలన్నారు సీఎం కేసీఆర్.

ఇక పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. క్రాస్‌ ఓటింగ్‌పై నివేదిక ఇచ్చిన మంత్రి పువ్వాడ క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి కేంద్రంపై వార్‌ ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ, కేంద్రం దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించారు.

Tags:    

Similar News