Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ మరింత కఠినం

Lockdown: కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్ * ఉదయం 10.10 తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదు: సీఎం

Update: 2021-05-22 05:48 GMT
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Lockdown: తెలంగాణలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ను మరింత కఠినతరం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశఆలు జారీ చేశారు. లాక్‌డౌన్ సరిగా అమలు చేయకపోతే జనాలు బయట తిరిగి సూపర్ స్ప్రెడర్స్‌గా మారి విజృంభణకు కారణం అయ్యే అవకాశం ఉందని సీఎం తెలిపారు. .. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురువుతున్న లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామరన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు స్వచ్చంధంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందని అన్నారు.. లాక్‌డౌన్ సరిగ్గా అమలు చేయాలని డీజీపీ, సీపీ, ఎస్పీ దిశానిర్దేశం చేశారు..

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా సాధారణ కార్యకలాపాలకు వెసులుబాటు ఉంటున్నందున.. 10.10 గంటల తర్వాత పాస్‌లు ఉన్నవారు తప్పా, మరెవరూ రోడ్లపై కనిపించకూడదలని వీల్లేదన్నారు. అనుమతి లేకుండా రోడ్ల మీదకు వస్తే వాహనం సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపైకి వచ్చే వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆర్థికంగా జరుగుతున్న నష్టం గురించి కూడా ఆలోచించకుండా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం వెల్లడించారు.

హైదరాబాద్‌ పరిధిలో కరోనా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 180 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.. 24 గంటలు పోలీసుల తనిఖీలు చెక్ పోస్టులులో సాగుతున్నాయని హైద్రాబాద్ సిటి పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు... ఇప్పటి వరకు 60 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఎమర్జెన్సీ పాస్ లను మిస్ యూజ్ చేయడంతో పాటు అకారణంగా పాత డాక్టర్ ప్రెస్క్రిప్షన్ పెట్టుకొని వంకర సమాధానాలు చెప్పేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News