CM KCR: దేశం గర్వించేలా సచివాలయ నిర్మాణం ఉండాలి

CM KCR: నూతన సచివాలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Update: 2021-12-09 14:59 GMT

CM KCR: దేశం గర్వించేలా సచివాలయ నిర్మాణం ఉండాలి

CM KCR: నూతన సచివాలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగడానికి కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం అభినందించారు. మంత్రి సహా ఆర్ అండ్ బీ శాఖ అధికారులు వర్క్ ఏజెన్సీ ఇంజనీర్లు పనుల గురించి సీఎం కేసీఆర్‌కు వివరించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను సీఎం పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఛాంబర్లు, పార్కింగ్‌ ఏరియాలు విశాలంగా ఉండాలన్నారు.

సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడల్స్‌ను అధికారులు సీఎం కేసీఆర్‌కు చూపించారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు. దేశం గర్వించేలా సచివాలయ నిర్మాణం ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైతే రాష్ట్రాల్లోని సచివాలయ నమూనాలను పరిశీలించి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త పడాలన్నారు.

Tags:    

Similar News