CM KCR: ఆరుతడి పంటలే వేయండి.. రాజకీయ చీడ కూడా పోతది
CM KCR: గద్వాల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మార్గ మధ్యంలో ఆగి మహేశ్వర రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతుల పంటలను పరిశీలించారు.
CM KCR: గద్వాల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మార్గ మధ్యంలో ఆగి మహేశ్వర రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతుల పంటలను పరిశీలించారు. వారు వేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజ నాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలే వేయాలని కేసీఆర్ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందని కేసీఆర్ అన్నారు. ఆరుతడి పంటల వల్ల భూసారం కూడా పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. వానాకాలంలో వరి పంట వేసుకుని, యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు కేసీఆర్ సూచించారు. పంటల సాగుపై కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు యుద్ధాలే జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.