Warangal Urban Collectorate: నూతన హంగులతో వరంగల్ అర్బన్ కలెక్టరేట్
Warangal Urban Collectorate: 6.73 ఎకరాల స్థలంలో రూ. 57 కోట్లతో నిర్మాణం * ఒకే భవనంలో 34 శాఖలు కొలువు
Warangal Urban Collectorate: సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా నూతన వరంగల్ అర్బన్ కలెక్టరేట్ రెడీ అయ్యింది. ఈ భవనాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
హన్మకొండ సుబేదారిలోని పాత కలెక్టరేట్ భవనాలను పూర్తిగా కూల్చివేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఇంటిగ్రేటెడ్ డిస్ర్టిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ పేరుతో నూతన భవనాన్ని నిర్మించారు. 6.73 ఎకరాల సువిశాలమైన స్థలంలో 57 కోట్ల అంచనా వ్యయంతో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను పూర్తిచేశారు. జీ ప్లస్ టూ అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో సుమారు 34 శాఖలు ఒకేచోట కొలువు తీరనున్నాయి. 50 మంది కూర్చునేలా వీడియో కాన్ఫరెన్స్ హాలు, 210 మంది కూర్చునేలా సమావేశ మందిరం నిర్మించారు.
ఫస్ట్ ఫ్లోర్‌లో 13శాఖలతో పాటు మంత్రికి ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. సెకండ్ ఫ్లోర్‌లో 15 డిపార్ట్‌మెంట్లతో పాటు 31 మంది కూర్చునేలా సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. ఇక అన్ని శాఖల సిబ్బందికి అవసరమైన గదులను సిద్ధం చేశారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో కలెక్టర్, రెవెన్యూకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్‌కు వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా స్టిల్ట్ ఫ్లోర్ ఏర్పాటు చేశారు. వాహనాలు నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద ఉన్న స్టిల్ట్ ఫ్లోర్‌కు వెళ్లి పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా అనుకున్న ప్లానింగ్‌కు పార్కింగ్ స్థలాన్ని రూ.5కోట్లతో అదనంగా నిర్మించారు. మొత్తానికి నూతన హంగులతో నిర్మాణామైన కలెక్టరేట్ భవనం వరంగల్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుంది.