T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు 8 సంవత్సరాల క్రితమే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు.
2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామన్నారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏడేళల్లో టీ హబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. టీ హబ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు అధికారులను ఆయన అభినందించారు.