కూటమిపై ఇక తగ్గేదే లే అంటున్న గులాబీ దళపతి..!

CM KCR: బంగారు తెలంగాణ సాధించాం.. ఇక బంగారు భారతమే లక్ష్యం.. అమెరికాను మించేలా.. అభివృద్ధి సాదిద్దాం.. సంగారెడ్డి పర్యటనలో గులాబీ అధిపతి చేసిన వ్యాఖ్యలే ఇవి.!

Update: 2022-02-22 09:24 GMT

కూటమిపై ఇక తగ్గేదే లే అంటున్న గులాబీ దళపతి..!

CM KCR: బంగారు తెలంగాణ సాధించాం.. ఇక బంగారు భారతమే లక్ష్యం.. అమెరికాను మించేలా.. అభివృద్ధి సాదిద్దాం.. సంగారెడ్డి పర్యటనలో గులాబీ అధిపతి చేసిన వ్యాఖ్యలే ఇవి.! కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ను గద్దె దించే వరకూ నిద్దురపోయేదే లేదని కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. అంతకు మించిన దూకుడుతో దూసుకుపోతున్నారు. నారాయణ్‌ఖేడ్ బహిరంగ సభ సాక్షిగా మూడో కూటమికి సర్వం సిద్ధం అన్న హింట్ ఇచ్చేశారు. ఇదే సమయంలో గులాబీ దళపతి ప్రతి మాటలోనూ ముంబై టూర్ సక్సెస్ జోష్ కనిపించింది.? ఇంతకూ ముంబై టూర్‌లో కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ అప్‌డేట్స్ ఏంటి.? థాక్రే ఓకే చెప్పారా..? పవార్ దూసుకుపొమ్మన్నారా.?

థర్డ్‌ఫ్రంట్‌లో దూకుడు పెంచిన కేసీఆర్ ముంబై పర్యటనతో మూడో కూటమిని కన్ఫర్మ్‌ చేసేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో భేటీలో మూడో కూటమిని మరింత ముందుకు తెచ్చారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తేల్చేశారు. అభిప్రాయాలు కలవడమే కాదు, అంతు చూద్దామన్న ఆలోచనలూ ఒకటయ్యాయన్నారు. ఇప్పుడు నారాయణ్‌ఖేడ్ బహిరంగ సభలోనూ అదే దూకుడు ప్రదర్శించారు. అంతకుమించిన పవర్ పంచ్‌లతో ఎన్డీయే సర్కార్‌పై మరోసారి యుద్ధం ప్రకటించారు.

బంగారు తెలంగాణ నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన గులాబీ అధిపతి దేశ రాజకీయాల కోసం మరోసారి అదే అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. దేశంలో బీజేపీ సర్కార్‌కు ప్రత్యామ్నాయం కావాల్సిందే అని బలంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సారి దేశరాజకీయాల కోసం మరోసారి బంగారు తెలంగాణ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. బంగారు భారతదేశ నిర్మాణమే లక్ష్యం అంటున్నారు. మూడో కూటమి ముంగిట కేసీఆర్ బంగారు భారతదేశ నినాదం రాజకీయ సంచలనం అవుతోంది.

ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు గులాబీ బాస్. దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే పనికిమాలిన దందా కొనసాగుతుందని మోడీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిద్దామని పిలుపునిస్తూనే భారత్‌ను అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసేలా ముందుకు సాగాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నారాయణ్‌ఖేడ్ బహిరంగ సభలో కేసీఆర్ గొంతు నుంచి వచ్చిన ప్రతి మాటలోనూ ముంబై టూర్ సక్సెస్ జోష్ కనిపించింది. ఓ వైపు థాక్రే, మరోవైపు శరద్ పవార్‌ వంటి నేతలతో వరుస భేటీలు నిర్వహించి సానూకూల ప్రకటనలు చేసిన కేసీఆర్ ఆ జోష్‌ను కొనసాగిస్తున్నారు. దేశరాజకీయాల్లో సరైన మార్పునకు ఇదే తొలి అడుగని, త్వరలోనే బీజేపీయేతర నేతలంతా హైదరాబాద్‌లో కలుస్తామనీ ప్రకటించడం మూడో కూటమికి నేతల సానుకూలత లభించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఉత్సాహంతోనే గులాబీ అధిపతి అంతకుమించిన జోష్‌తో కూటమి వ్యూహాలు రచిస్తున్నారంటున్నారు విశ్లేషకులు. అయితే, కేసీఆర్ ముంబై టూర్ సక్సెస్ అయినట్టేనా అన్నది భాగ్యనగర సమావేశం తర్వాతే క్లారిటీ వస్తుంది.

ఇదే సమయంలో గులాబీ అధిపతి మూడో కూటమి జోష్‌పై తెలంగాణ బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది. మరోసారి కేసీఆర్‌పై విచారణ అస్త్రం సంధించింది టీబీజేపీ. రాష్ట్రానికి ఏం చేశారని.. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. కేసీఆర్ దోచుకున్న డబ్బుపై త్వరలోనే విచారణ అంటూ టీబీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ ముంబై టూర్‌పై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్ మళ్లీ కొత్త నాటకానికి తెరలేపారని బండి సంజయ్ మండి పడ్డారు.

టీబీజేపీ విమర్శలు ఇలా కొనసాగుతుండగానే కూటమిపై కేసీఆర్ తన పని తాను చేసుకుపోతున్నారు. థాక్రే, పవార్‌లతో చర్చల రిజల్ట్స్ త్వరలోనే చూస్తారని ఆసక్వికర ప్రకటన చేసిన గులాబీ అధినేత ఇక ముందూ కూటమి ఏర్పాట్లలో దూకుడుగానే ఉండేలా కార్యాచరణ చేస్తున్నారట. మూడో కూటమికి బీజేపీయేతర సీఎంల మద్దతు కూడగట్టేందుకు పలు రాష్ట్రాల్లో పర్యటించేందుకు డిసైడ్ అయ్యారట. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కోల్‌కతా, చెన్నై, బెంగళూర్‌లో అతి త్వరలోనే పర్యటించేందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయనీ, మమతా, స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడతో మరోమారు కీలక చర్చలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్న వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.

మొత్తంగా మూడో కూటమి కోసం గులాబీ అధినేత అందివచ్చిన ఏ అంశాన్నీ వదులుకోవడం లేదు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు. పరిస్థితి చూస్తుంటే మూడో కూటమి ముంగిట ఇటు తెలంగాణలోనూ అటు దేశ రాజకీయాల్లోనూ అసలు సిసలు పొలిటికల్ వార్ ముందే ఉన్నట్టు కనిపిస్తోంది.

Tags:    

Similar News