KCR: త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. బహిరంగ సభలతో జనంలోకి...
KCR: ఇతర పార్టీలోకి నేతలు వెళ్లకుండా కేసీఆర్ జాగ్రత్తలు...
KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎక్కువగా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారు.. లేదంటే ప్రగతి భవన్‌లో ఉంటారన్న విమర్శలు పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా వినబడతాయి. అంతేకాదు.. కేసీఆర్ జనం కష్టాలను తెలుసుకోరని ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాయి.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎక్కువగా బయటికి రాలేదన్న వాదనలు ఉన్నాయి. ఏదైన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తప్ప ఆయన ఫామ్‌హౌస్ లేదా ప్రగతి భవన్‌లో ఉండి తన వ్యూహాలకు పదును పెడుతుంటారని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ హుజూరాబాద్ బైపోల్ లో ఓటమి తర్వాత కేసీఆర్‌లో మార్పు వచ్చిందని సొంతపార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న అంచనాకు కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనికోసం పార్టీ క్యాడర్ ఇతర పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని టాక్. అందుకోసమే ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా... అటు ఫామ్‌హౌస్, ఇటు ప్రగతి భవన్‌ను వీడి ప్రజల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల పర్యటనకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. మొదట వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, జనగాం జిల్లాల్లో పర్యటిస్తూ.. పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. అందులో భాగంగానే బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరోసారి చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.