Yadadri Temple: యాదాద్రి పునర్‌నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష
Yadadri Temple: యాదాద్రి పునర్‌నిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Yadadri Temple: యాదాద్రి పునర్‌నిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చివరి అంకం చేరుకున్న ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు ఆలయ లైటింగ్ డెమో చూపించారు. విద్యుద్దీపాలంకరణలో యాదాద్రి ఆలయం బంగారు కాంతులీనుతూ ఆకట్టుకుంటోంది.
రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం కేసీఆర్ తిలకించారు.