ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం కేసీఆర్
విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానితో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురిని కలువనున్నట్లు సమాచారం.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం కేసీఆర్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్... రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం సంబంధిత శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానితో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురిని కలువనున్నట్లు సమాచారం. జాతీయ రహదారులకు నిధుల మంజూరుపై గడ్కరీతో, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుపై హర్‌దీప్‌సింగ్‌తో చర్చించే అవకాశం ఉంది. నిన్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.