33 జిల్లాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడమే సీఎం లక్ష్యం - హరీష్ రావు
Harish Rao: తలసిమియా సికిల్ సెల్ అనిమియా నిరోధంపై జాతీయ సదస్సు...
Harish Rao: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు. రాజేంద్రనగర్‌లో తలసీమియా నిరోధంపై నిర్వహించిన జాతీయ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. నిత్యం రోగులతో కిటకిటలాడే 4 ప్రధాన ఆసుపత్రుల్లో 100 బెడ్స్ కెపాసిటీ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తలసీమియా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం సంతోషకమన్న మంత్రి హరీష్‌రావు..ఇలాంటి సదస్సును నిర్వహించిన సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షులు చంద్రకాంత్ అగర్వాల్, కార్యదర్శి డాక్టర్ సుమన్ జైన్‌తో పాటు 23 రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.