Revanth Reddy: కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ

Revanth Reddy: ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామాలకు, మండలాలకు.. జిల్లాలకు నెట్‌వర్క్ కల్పిచండమే టీ-ఫైబర్ లక్ష్యం

Update: 2024-08-23 13:13 GMT

Revanth Reddy: కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ 

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భార‌త్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు స‌మ‌ర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వ‌ర్క్ కల్పించడమే టీ-ఫైబర్ లక్ష్యమని తెలిపారు. టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65 వేల ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించాలన్న లక్ష్యంతో రూపొందించింది.

టీ-ఫైబర్‌ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌ర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది కార్యరూపం దాల్చితే.. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News