TS Elections: ఓటేసేందుకు కదిలిన నగరవాసులు.. జనాలతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

TS Elections: ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటేందుకు పల్లె జనం ఆరాటం

Update: 2023-11-29 14:45 GMT

TS Elections: ఓటేసేందుకు కదిలిన నగరవాసులు.. జనాలతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

TS Elections: తెలంగాణ ఓటర్లు పల్లె బాట పట్టారు. ఉపాధి కోసం పట్నానికి వచ్చిన వలస పక్షులు.. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంతూరికి పయనం అవుతున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో పాల్గొని పౌరుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధమయ్యారు. ఉపాధి కోసం ఉన్న ఊరిని విడిచి హైద్రాబాద్‌కు వలస వచ్చిన బతుకు జీవులు తెలంగాణలో ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది తమ ఓటును హైదరాబాద్‌కే మార్చుకోగా ఎక్కువ శాతం మంది మాత్రం సొంతూరిలోనే ఓటు వేయబోతున్నారు.

పోలింగ్‌కు టైం దగ్గర పడటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్లు పల్లె బాట పట్టారు. తమ తలరాతను మార్చే ఓటు అనే వజ్రాయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి బయలుదేరారు. ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటబోతున్నారు పల్లె జనం. ఓటర్ల ప్రయాణతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిపోయాయి. ప్రజలతో హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. సొంతూరికి చేరుకుని ఓటు వేయాలనే ఉత్సాహంతో ఉన్నారు జనం.

తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలతో పోల్చితే పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు అవుతుంది. ఎన్నికల వేళ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడుతున్నది పల్లెవాసులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2018లో హైదరాబాద్‌లో 49శాతం ఓటింగ్ నమోదు అయితే.. అదే జిల్లాల్లో మాత్రం 75శాతానికి పైనే ఓటింగ్ శాతం నమోదు అయింది.

Tags:    

Similar News