Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో కోరారు.పోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతన్నతో లింగయ్య ఫోన్లు చేశారని గుర్తించారు. ఈ విషయమై విచారించేందుకు లింగయ్యకు పోలీసులు నోటీసులు పంపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు జరుగుతోంది.ఈ కేసులో తొలుత ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన వెల్లడించిన అంశాల ఆధారంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎస్ఐబీ ఓఎస్డీగా అప్పట్లో పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు, శ్రవణ్ రావుపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రస్తుత అమెరికాలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిని హైద్రాబాద్ కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ అంశాన్ని వదిలపెట్టబోమని ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయమై విచారణకు ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సర్కార్ పై ఆరోపణలు చేశారు.