Chat Pat APP alternate to Tiktok: టిక్‌టాక్‌ ప్లేస్ లో తెలంగాణ చట్‌పట్‌... టాప్ టెన్ లో స్థానం..

Chat Pat APP alternate to Tiktok: టిక్ టాక్ ఈ యాప్ గురించి తెలియని వాల్లు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఈ యాక్ కి బానిసలుగా మారిపోయారు.

Update: 2020-07-01 05:00 GMT

Chat Pat APP alternate to Tiktok: టిక్ టాక్ ఈ యాప్ గురించి తెలియని వాల్లు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఈ యాక్ కి బానిసలుగా మారిపోయారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు వీడియోలను తీసి పోస్ట్ చేసి వచ్చిన లైక్ లను చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇక ఇటీవలే చైనా బారత్ మధ్య జరిగిను ఘర్షనలో భారతీయ జవాన్లు మృతి చెందడంతో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్ లపై నిషేధం విధించింది. వాటిలో టిక్ టాక్ యాప్ కూడా ఉండడంతో చాలా మంది టిక్ టాక్ ఫాలోవర్స్ కి షాక్ తగిలినంత పనైంది. ఇక తమ టాలెంట్ ని ప్రజలకు ఏ విధంగా చూపించాలి అని బాధపడుతున్న వేళ తెలంగాణకు చెందిన ఓ యువకుడు అచ్చం టిక్ టాక్ లాంటి ఓ యాప్ ను రూపొందించారు.

ఆ యాప్ కు 'చట్‌పట్‌' అనే పేరును కూడా పెట్టాడు. టిక్ టాక్ యాప్ ను ఏ విధంగానైతే ఉపయోగిస్తారో అచ్చం అదే విధంగా ఈ ఛట్ పట్ యాప్ ను కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఇప్పుడు ఈ చట్‌పట్‌ యాప్ కు ప్లేస్టోర్‌లో డిమాండ్‌ బాగా పెరిగింది. టిక్ టాక్ ని ఆపేసిన 24 గంటలలోనే వైరల్‌ అయిన చట్ పట్ యాప్‌ ప్లేస్టోర్‌ ట్రెండింగ్‌ సోషల్‌ క్యాటగిరీలో టాప్‌-10లో నిలిచింది.

ఇక టాప్ లో నిలిచిన ఈ యాన్ ను రూపొందించిన వారి వివరాల్లోకెళితే వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన నస్కంటి శ్రీనివాస్‌ చట్‌పట్‌ యాప్‌కు రూపకల్పన చేశారు. అతను ఇంతకంటే ముందే మరో ఏడు యాప్‌లను రూపొందించినప్పటికీ వాటికి సరైన స్పందన రాలేదు. అయినా అతను నిరాశ చెందకుండా పట్టుదలతో మరో యాప్ రూపొందించాడు. దానికి చట్ పట్ అని పేరుపెట్టాడు. ఈ యాప్‌ జూన్‌ 29న ప్లేస్టోర్‌ లోకి రాగా కేవలం ఒక్క రోజులోనే దీన్ని మూడువేల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీంతో ఈ యాప్ సోషల్‌ విభాగం ట్రెండింగ్‌లో టాప్‌ 10లో చట్‌పట్‌ 9వ స్థానానికి చేరింది. వినియోగదారులు చట్‌పట్‌కు 4.9 రేటింగ్‌ ఇచ్చారు.


Tags:    

Similar News