Telangana: ఉమ్మడి మెదక్ జిల్లాలో చిరుత కలకలం
Telangana: నార్సింగిలో మేకలపై చిరుత దాడి * చిరుత దాడులతో భయాందోళనలో ప్రజలు
Telangana: మెదక్ జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది. వరుసగా దాడులు చేస్తూ కలవరనికి గురి చేస్తోంది. మేకలను, గొర్రెలను ఎత్తుకెళ్తూ ప్రజలను భయభ్రంతులకు గురి చేస్తోంది. దాంతో ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. చిరుత పులి గ్రామాల సరిహద్దుల్లో సంచరిస్తూ భయందోళనకు గురి చేస్తుంది. ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న చిరుతపులి బాధ నుంచి తమను రక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మేకల మందపై చిరుత దాడి చేసింది. రోజుకోక మేకను ఎత్తుకెళ్తూ భయాందోనలకు గురి చేస్తోంది. దాంతో రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఒంటరిగా ఎక్కడకు వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు.. అక్కడక్కడ బోనులను ఏర్పాటు చేసి.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.