బీజేపీపై 132కోట్ల చార్జిషీట్ వేయాలి : మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య చార్జిషీట్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఆరేళ్లపాలనపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ చార్జిషీట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మార్చుతామని మభ్యపెట్టి చివరకు వరదల మయం చేశారని కేంద్రమంత్రి విమర్శించారు.

Update: 2020-11-22 14:12 GMT

టీఆర్ఎస్, బీజేపీ మధ్య చార్జిషీట్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఆరేళ్లపాలనపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ చార్జిషీట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మార్చుతామని మభ్యపెట్టి చివరకు వరదల మయం చేశారని కేంద్రమంత్రి విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్ల పాలన అవినీతికి చిరునామాగా మారిందని ప్రకాశ్‌ జవడేకర్ ధ్వజమెత్తారు. అయితే జవడేకర్ సొల్లు పురాణం చెబుతున్నారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీపై 132కోట్ల చార్జిషీట్ వేయాలని కేటీఆర్ అన్నారు. 

ఇక టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బస్తీలన్నీ డెవలప్‌ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో మంచినీళ్ల కోసం మహిళలు ధర్నాలు చేసేవారని మంత్రి గుర్తుచేశారు. కానీ కేసీఆర్ పాలనలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. హైదరాబాద్‌ కోసమే కేశవపూర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 4 తర్వాత వరద బాధితులందరికీ వరద సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News