Huzurabad: ఉప ఎన్నికల విజయోత్సవ సంబరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
*గెలిచిన అభ్యర్థులు ఎక్కడా విజయోత్సవ ర్యాలీ నిర్వహించొద్దన్న సీఈసీ *కరోనా నిబంధనలు అనుసరించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
Huzurabad: ఉప ఎన్నికల విజయోత్సవ సంబరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గెలిచిన అభ్యర్థులు ఎక్కడా విజయోత్సవ ర్యాలీ నిర్వహించొద్దంది సీఈసీ. కరోనా నిబంధనలు అనుసరించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. అంతేకాదు ఎన్నికల సంఘం నుంచి సర్టిఫికేట్ తీసుకునేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని తెలియజేసింది.
అటు ఎస్.ఆర్.ఆర్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. సీపీ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 14 మంది సీఐలు, 41 మంది ఎస్సైలు, 500 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్ ఫోర్స్‌తో మూడెంచల భద్రత కొనసాగుతుంది.