BRS సోషల్ మీడియాపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం
Revanth Reddy: బీఆర్ఎస్‌పై సీఈసీ చర్యలు తీసుకోవాలి
Revanth Reddy: రైతుబంధు విషయంలో తనపై BRS సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రైతుబంధుపై సీఈసీకి పీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను రాసినట్లు.. ఫేక్ లేఖను సృష్టించి బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ దిగజారి ఫేక్ ప్రచారాలు చేస్తోందన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలని సీఈసీ, ఎస్‌ఈసీ వికాస్‌రాజ్, డీపీని కోరుతున్నామని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.