ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ అధికారులు

* హైదరాబాద్ నివాసంలో అందుబాటులో ఉంటామన్న కవిత

Update: 2022-12-06 02:29 GMT

ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ అధికారులు

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ముందస్తుగా నోటీసు జారీ చేసిన సీబీఐ అధికారులు తేదీని, సమయాన్ని ఖరారు చేశారు. హైదరాబాద్‌లో గానీ, ఢిల్లీలో గానీ ఎక్కడ అందుబాటులో ఉంటారోనని ముందుగానే ఆప్షన్ ఇచ్చారు. నోటీసును అందుకున్న ఎమ్మెల్సీ కవిత తొలుత హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉంటానని సీబీఐ అధికారులకు విన్నవించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు సీబీఐ నోటీసులు జారీ చేయడంపై పార్టీ సీనియర్ నేతలు, న్యాయనిపుణులతో చర్చించారు. కేంద్ర హోంశాఖ అధికారులు.. ఢిల్లీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులు.. దాని ఆధారంగా సీబీఐ నమోదు చేసిన కేసు ఎఫ్ఐఆర్‌లో ఏముందనే విషయాలపై చర్చించారు. ఆ తర్వాత సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి వివరాలు కోరుతూ కవిత లేఖ రాశారు.

ఫిర్యాదుకాపీ, ఎఫ్ఐఆర్ కాపీ నెట్‎లో అందుబాటులో ఉందనే సమాధానంతో పరిశీలించారు. అందులో తన పేరు లేదని మరోసారి సీబీఐ అధికారులకు కవిత లేఖ రాశారు. మరోవైపు సీబీఐ రేపటి విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కవిత రాసిన లేఖపై సీబీఐ అధికారులు ఇంకా స్పందించలేదు. ఎమ్మెల్సీ కవిత అడిగిన తేదీల్లో విచారణకు అనుమతిస్తారా..? లేదా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News