బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం
Congress: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి
Congress: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇన్ని రోజులు చెవేళ్ల ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని గులాబీ పార్టీ అధినేతను రంజిత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం.. కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. ఉన్నపళంగా వెళ్లిన ఇద్దరూ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే.. కాసేపటి క్రితమే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి... ఈ చేరికలపై ప్రస్తావించారు. గేట్లు తెరిచామాని.. ఓ ఎంపీ.. ఎమ్మెల్యే గేటు దాటారు అని రేవంత్ రెడ్డి అన్నారు.. కాగా.. రంజిత్ రెడ్డికి చెవెళ్ల, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ ఎంపీగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.