Kishan Reddy: గ్యాస్ ధర తగ్గిస్తే విమర్శలా?.. రాష్ట్రంలో పెట్రోల్‌పై ట్యాక్స్ ఎందుకు తగ్గించలే..?
Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధరలు తగ్గించాలి
Kishan Reddy: తమ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై 200 తగ్గిస్తే బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ తనయుడు వికాస్ రావు, ఆయన సతీమణి డాక్టర్ దీప బీజేపీలో చేరిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. గతంలో ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గించి, రాష్ట్రాలను కూడా తగ్గించుకొమ్మని సూచించినప్పుడు చాలా రాష్ట్రాలు ధరలు తగ్గించాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదరని విమర్శించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలోనే పెట్రోల్ ధర అధికంగా ఉందన్నారాయన... తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో మద్యం అమ్మకుంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు నెలల ముందే మద్యం షాపులకు వేలం వేశారని మంత్రి దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబం మద్యం తాగించి.. తెలంగాణ ప్రజల రక్తం తాగుతుంతోందని ధ్వజమెత్తారు... పేదలకు ఇల్లు కట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉందన్నారు.. రాష్ట్రంలో మార్పు రావాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి.