అత్యాచార బాధితురాలి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. పార్టీ నుండి సోదరులను సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే షకీల్..

MLA Shakil: నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆదేశం

Update: 2023-06-21 13:08 GMT

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బీఆర్ఎస్‌ నేత తమ్ముడు

MLA Shakil: నిజామాబాద్‌ బోధన్‌లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే షకీల్ ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్‌ నేత తమ్ముడు రవీందర్‌ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. కొంతకాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ... బెదిరిస్తున్నాడని తెలిపింది. దీంతో నిందితుడు రవీందర్‌తో పాటు అతని సోదరున్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఎమ్మెల్యే షకీల్‌. 

Tags:    

Similar News