తెగిన చెరువు కట్ట.. వరదలో కొట్టుకుపోయిన హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి

హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 100 ఏళ్లలో ఇలా కురవడం రెండోసారి అంటున్నారు. భారీ వరదల ప్రభావంతో శివారు గగన్ పహడ్ లోని అప్ప చెరువు కట్ట..

Update: 2020-10-14 02:30 GMT

హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 100 ఏళ్లలో ఇలా కురవడం రెండోసారి అంటున్నారు అధికారులు. భారీ వరదల ప్రభావంతో శివారు గగన్ పహడ్ లోని అప్ప చెరువు కట్ట తెగి వరద నీరు స్థానికంగా ఇండ్లలోకి చేరింది.. దీంతో హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి వరదలో కొట్టుకుపోయింది. వరధ నీటి ఉదృత్తికి పలువురు గల్లత్తు అవ్వడం కాకుండా కొట్టుకుపోయిన వందలాదీ వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. వరధ నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు మట్టిలో కూరుకపోయాయి.. దాంతో అధికారులు మట్టిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

వరద ప్రభావంతో హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిని గగన్ పహడ్ వద్ద పొలీసులు పూర్తిగా మూసివేశారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ కు వెల్లాల్సిన ప్రయాణికులు గగన్ పహడ్ కాకుండా పహాడిశేరీఫ్ నుండి వెళ్లాలని పొలీసులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే వచ్చే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్రజ‌లంద‌రూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప ఇళ్లలోనుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు. 

Tags:    

Similar News