గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా ప్రాంతాల్లో నామమాత్రంగా ఉంటాయి. కానీ బోనకల్ మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పటల్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. గవర్నమెంట్ హాస్పటలే కానీ ఇక్కడ సీన్ చూస్తే వేరేలా ఉంటుంది. చెప్పుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటలే అయినా ప్రైవేట్ హాస్పిటల్‌కు దీటుగా ఉంటుంది. అక్కడకు వచ్చే రోగులను వైద్యం చేయడంలో బెస్ట్ హాస్పిటల్‌గా పేరు సంపాదించింది. దానికి కారణం డాక్టర్ శ్రీకాంత్, హాస్పటల్‌లో పనిచేసే స్టాఫ్. డాక్టర్ శ్రీకాంత్ ఆసుపత్రిని ఏ విధంగా తీర్చి దిద్దారు? తక్కువ కాలంలోనే ఆసుపత్రికి మంచి పేరు రావడానికి గల కారణాలేంటి? ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్‌పై హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. జిల్లాలోని బెస్ట్ హాస్పిటల్ గా కాయకల్ప అవార్డును సొంతం చేసుకుంది. మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తోంది. పచ్చదనం, పారిశుధ్య మెరుగుదల చూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డును సొంతం చేసుకుంది. బోనకల్ హాస్పటల్‌కి 2018 ఆగస్టులో డాక్టర్ శ్రీకాంత్ ఛార్జ్ తీసుకున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి హాస్పటల్‌పై పూర్తిగా దృష్టి సారించారు. ఆస్పత్రిలో అరకొర వసతులు చూసి తన సొంత డబ్బులతో హాస్పిటల్‌లో ఉన్నవసతులను పెంచుకుంటూ వస్తున్నారు. అన్ని హంగులతో మూడు లక్షల రూపాయల వరకు తన సొంత నగదును ఖర్చు చేసి తీర్చి దిద్దారు.
ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వత్సవాయి మండలం ప్రజలు కూడా బోనకల్ పీహెచ్సీకి వస్తుంటారు. దీనివల్ల హాస్పిటల్‌కి రద్దీ ఎక్కువగా ఉంటుంది. తనతోపాటు ఆసుపత్రి స్టాప్ కూడా డిడికేషన్‌తో వర్క్ చేయడం వల్లనే ఈరోజు కాయకల్ప అవార్డు దక్కిందని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇంకా రాబోయే రోజుల్లో రోగులకు మరింత ఆసరాగా నిలిచే విధంగా సేవలందిస్తామని చెప్పారు. సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడు బోనకల్ ప్రాంతంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు జిల్లా వైద్యాధికారులు గుర్తించి బోనకల్ హాస్పటల్‌ని 30 పడకల హాస్పిటల్‌గా రూపాంతరం చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కోరుకుంటున్నారు.